బేవర్స్ మాటలకు సమయం లేదు.. భార్యతో విడాకులపై హేమచంద్ర షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-28 03:47:44  IST  )

గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలోని కపుల్స్ అనుకోని విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

బేవర్స్ మాటలకు సమయం లేదు.. భార్యతో విడాకులపై హేమచంద్ర షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలోని కపుల్స్ అనుకోని విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలకే పెళ్లైన ఏడాదికే పచ్చని కాపురాలను ముక్కలు చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తమ బంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ బ్యూటిఫుల్ జంటల్లో సింగర్స్ శ్రావణ భార్గవి(Shravan Bhargavi), హేమచంద్ర(Hemachandra) కూడా ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ పాప కూడా ఉంది. కానీ మనస్పర్థలు తలెత్తడంతో గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకుని మూడేళ్ల క్రితమే విడిపోయినప్పటికీ డైవర్స్‌పై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వారు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతోనే వీరిద్దరు విడిపోయారని నెటిజన్లు కనిపెట్టేశారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమచంద్ర విడాకులపై స్పందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యాంకర్ విడాకులపై ప్రశ్నించగా.. ‘‘వార్తలు ఏదైనా సరే అది నిజమా కాదా పక్కన పెడితే దానివల్ల నీకు ఏమైనా పనికొస్తదా, అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అంటే చెప్పు చెప్తా. నా పై వచ్చే కామెంట్స్ ని నేను కేర్ చెయ్యను, అవి నన్ను ఎఫెక్ట్ చెయ్యవు. అవి నిజమా కదా అనేది నేనెందుకు చెప్పాలి. నేను సింగర్‌గా తెలుసు.. దాని గురించి అడుగు. చాలా మంది ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి అని అనుకుంటారు.. కానీ నేను ఆ టైప్ కాదు. నేను మాట్లాడితే కనీసం ఒకరైనా ఇన్ స్పైర్ అవ్వాలి. బేవర్స్ మాటలకు సమయం లేదు.

ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక Q & A సెషన్ పెడదాం. వాళ్ళను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఈ విషయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చితే అప్పుడు సమాధానం చెప్తాను. వాళ్ళు అనే మాటలు పట్టించుకునేంత టైం నాకు లేదు. జనాలు పక్కనోళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. నువ్వు ఒకరికి వర్క్ వల్ల తెలిస్తే దాని గురించే మాట్లాడు. వాళ్ల పర్సనల్ లైఫ్ ఎందుకు. ఒకవేళ నిజంగా అంతగా తెలుసుకోవాలనుకుంటే నాకు టైం ఉన్నప్పుడు మాట్లాడతాను అప్పటి వరకు వెయిట్ చేయండి’’ అని చెప్పుకొచ్చారు.

Next Story