- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనవల్లే నాతో ఎవరూ డేటింగ్ చేసే సాహసం చేయలేదు: Pooja Bedi
సీనియర్ నటి పూజా బేడీ తన యవ్వనంలో ప్రేమ విషయంలో ఎదుర్కొన్న ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

X
దిశ, సినిమా: సీనియర్ నటి పూజా బేడీ తను యవ్వనంగా ఉన్నప్పుడు ప్రేమ విషయంలో ఎదుర్కొన్న ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రీసెంట్‌గా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆమె.. అందరితోపాటు తనకు బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయాలనే కోరిక ఉండేదని చెప్పింది. అయితే తన తండ్రి, నటుడు కబీర్ బేడీ వ్యక్తిత్వం చూసి ఎవరూ తనతో డేటింగ్ చేసే సాహసం చేయలేదని, కనీసం తనతో కాఫీ తాగేందుకు కూడా ఎవరూ బయటకు వచ్చే వాళ్లు కాదని తెలిపింది. అంతేకాదు ఆయన హైట్, పర్సనాలిటీ చూసి కాలేజీలోనూ అబ్బాయిలెవరూ తన దగ్గరకు వచ్చేవారు కాదని చెబుతూ.. ‘నాతో ఎవరూ సరదాగా జోకులు కూడా వేయలేదు. నిజానికి నన్ను అలా దూరం పెట్టడం బాధగా ఉండేది. స్నేహితులు కూడా నాతో భయం భయంగానే గడిపేవారు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.
Also Read..
మనువరాలి వయసున్న హీరోయిన్‌ను మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో?
Next Story






