మా కష్టాలను ఎవరూ పట్టించుకోరు.. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పరిస్థితిపై జాన్వీ కపూర్ ఏమన్నారంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-04 07:21:24  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పలు కామెంట్స్ చేస్తూ.. అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మా కష్టాలను ఎవరూ పట్టించుకోరు.. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పరిస్థితిపై జాన్వీ  కపూర్ ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పలు కామెంట్స్ చేస్తూ.. అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, జాన్వీ ఓ చర్చలో భాగంగా.. బయట వ్యక్తులతో పోలిస్తే.. స్టార్ కిడ్స్ పరిస్థితి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో వివరించింది. మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘స్టార్ కిడ్స్ ఇబ్బందులు చెప్పినా వారి కష్టాలను ఎవరూ పట్టించుకోరు. అవి చెప్పినా విడ్డూరంగా ఉంటాయి కాబట్టి వినడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించరు. అందుకే ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కష్టాలు పడ్డామని ఎవరూ చెప్పుకోరు. ఎందుకంటే.. బయటివారితో పోలిస్తే.. వారికి లభించిన సౌకర్యాలకు వారెప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు.

అలా కాకుండా మేం ఇంత కష్టపడుతున్నాం అని చెబితే ఎవరూ వినరు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాలని నాకూడా తెలుసు. ఆ పోరాటాలు స్టార్ కిడ్స్‌కు అర్థం కావు. ఎందుకంటే వారు.. అవన్నీ చేసి ఇండస్ట్రీలోకి రారు కాబట్టి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఈ అమ్మడు ప్రస్తుతం ‘పెద్ది’ (peddi)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రామ్ చరణ్‌(Ram Charan)కు జోడీగా నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story