రామ్ చరణ్ ఫాన్స్ కు బిగ్ షాక్.. ఆ సినిమాకు బ్రేకులు ?

by velandi.Saikiran |   (  Updated:2025-07-16 13:06:20  IST  )

టాలీవుడ్ ఆగ్ర హీరో రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని

రామ్ చరణ్ ఫాన్స్ కు బిగ్ షాక్.. ఆ సినిమాకు బ్రేకులు ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఆగ్ర హీరో రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు రామ్ చరణ్. అయితే అలాంటి రామ్ చరణ్ కెరీర్ ను RRR సినిమా మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పెద్ది (Peddi) సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. పెద్ది సినిమా తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్.. రంగస్థలం తరహాలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. మొన్నటి వరకు ప్రచారం కూడా సాగింది.

అయితే దీనిపై అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అసలు ప్రశాంత్ నీల్ (Prasanth Neel), రామ్ చరణ్ మధ్య ఎలాంటి సినిమా రావడం లేదట. ప్రశాంత్ నీల్ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా ఉండనున్నాడట. తన సినిమాలు అయిపోయిన తర్వాత.. మరో ఏడాది పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట. అలాగే రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా లేదని కూడా ఆయన బృందం ప్రకటించినట్లు చెబుతున్నారు.

Next Story