Dhanush: నాపై ఎంత నెగిటివ్ ప్రచారం అయినా చేసుకోండి.. మీకు నన్ను ఆపే దమ్ములేదంటూ ధనుష్ మాస్ వార్నింగ్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-02 12:49:30  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌(Dhanush)కు పరిచయం అక్కర్లేదు. ఆయన భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు.

Dhanush: నాపై ఎంత నెగిటివ్ ప్రచారం అయినా చేసుకోండి.. మీకు నన్ను ఆపే దమ్ములేదంటూ ధనుష్ మాస్ వార్నింగ్ (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌(Dhanush)కు పరిచయం అక్కర్లేదు. ఆయన భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. అంతేకాకుండా ఓ వైపు హీరోగా నటిస్తునే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ధనుష్ ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక (Rashmika Mandanna)హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ‘కుబేర’ ఆడియో లాంచ్ నిర్వహించగా ఇందులో ధనుష్ హేటర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన సినిమాపై ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా హిట్ కొడతానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మీరు నాపై ఎంత నెగిటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనిని ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకు వెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు కేవలం నా అభిమానులు మాత్రమే కాదు వారు నా సహచరులు కూడా.

23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్ చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నాను. పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి ‘కుబేర’ లాంటి సినిమా అవసరం. నాకు ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే ధనుష్ ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

Next Story