నాకు ఎంత డబ్బు ఇచ్చినా సరే అలాంటి పాత్రలు అస్సలు చేయను: సత్యదేవ్

by Mallepaka Hamsa |

యంగ్ హీరో సత్యదేవ్(Satyadev) ఓ వైపు లీడ్ రోల్‌లో నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

నాకు ఎంత డబ్బు ఇచ్చినా సరే అలాంటి పాత్రలు అస్సలు చేయను: సత్యదేవ్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సత్యదేవ్(Satyadev) ఓ వైపు లీడ్ రోల్‌లో నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సత్యదేవ్ ‘కింగ్‌డమ్’(Kingdom) సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. ఆయన ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు మూవీ ‘తండేల్’ కథతో ‘అరేబియా కడలి’ (Arabia Kadali)పేరుతో రాబోతుంది.

అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేయట్లేను. నా సంతోషం కోసం చేస్తున్నాను. ‘గాడ్ ఫాదర్’ మూవీ తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అలాంటి పాత్రలు చేయమని చాలామంది నన్ను అడిగారు. కానీ పాత్ర నచ్చక నేను ఒప్పుకోలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను డబ్బు కోసం సినిమాలు చేయలేదు. మంచి పాత్రల కోసం ఎదురుచూశాను.

అందుకే ఇప్పుడు శివ లాంటి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. డబ్బు కోసం సినిమాలు చేయొద్దని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. ఒకవేళ నాకు డబ్బులు మాత్రమే కావాలనుకుంటే ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటే వస్తాయి. అంతే కానీ డబ్బు కోసం నచ్చని పాత్రలు అస్సలు చేయను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story