మా లాంటి దర్శకులు ఎన్ని సినిమాలు చేసినా అది ఆ హీరో పెట్టిన భిక్షే.. బాబీ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-11 07:09:56  IST  )

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) త్వరలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

మా లాంటి దర్శకులు ఎన్ని సినిమాలు చేసినా అది ఆ హీరో పెట్టిన భిక్షే.. బాబీ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) త్వరలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 13న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న దర్శకుడు బాబీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘సాధారణంగా రవితేజ గారికి తక్కువ మంది శత్రువులు ఉంటారు. ఆయప ఏదైనా సరిగ్గా చేయకుంటే.. కొంతమంది రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారని అంటున్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా కోసం వస్తుంది.

అందరి హీరోలకంటే చాలా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది ఆయనే.షాక్, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో.. వాటిని మనం నిజంగానే పెద్ద ఫిగర్లు చేసుంటే బాగుండేది. 2014 మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ నేను ఎన్ని సినిమాలు చేసినా..ఎన్ని బ్లాక్ బస్టర్స్ తీసినా ఆ ప్రోమో. అన్నా నీలాంటి ఒకడు ఉండాలి ఇండస్ట్రీకి ఎంతోమంది ట్రైన్‌లో కూర్చున్న అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్ చేసే విసా మీరు. ఇవాల ఎంతో మంది డైరెక్టర్లు ఏ సినిమా చేసినా అది రవితేజ గారు పెట్టిన భిక్షనే. ఆయన అవునన్నా కాదన్నా అదే నిజం’’ అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వాటిని చూసిన వారంతా రవితేజపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story