- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు ఎంత ప్రయత్నించిగా నా నుండి తప్పించుకోలేవు.. హాట్ టాపిక్‌గా మారిన శ్రద్ధా కపూర్ పోస్ట్.. అతడి గురించేనా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. తెలుగు, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గత ఏడాది ‘స్త్రీ-2’ సినిమాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్త్రీ-3Stree-3, నాగిన్ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రేమనూ, వేదనను కలగలిపి నట్లుగా ఉండేలా ఉన్న పోస్ట్‌తో అందరినీ ఆలోచింపచేసింది.
‘‘నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీ పక్కన కూర్చుంటాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు నేను నిన్ను దగ్గరికి తీసుకోవడానికి వస్తాను. నువ్వు తప్పిపోతావని నాకు తెలుసు. నువ్వు పారిపోతావనీ కూడా తెలుసు. కానీ నేను నిన్ను కచ్చితంగా కనుక్కుంటాను. నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను. నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్లాలని చూసినా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీడలా నీ వెంటే నేను వస్తాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆమె ఈ పోస్ట్ రిలేషన్ షిప్ గురించే పెట్టింది కావచ్చని అనుకుంటున్నారు. కాగా, గత కొద్ది కాలంగా శ్రద్ధా కపూర్ సినీ రచయిత రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.నిత్యం వీరిద్దరు కలిసి వెకేషన్స్‌కు కూడా వెళ్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్. ఇక ఈ క్రమంలో.. శ్రద్ధా ఇలాంటి పోస్ట్ పెట్టడంతో చర్చకు దారితీసింది.






