‘ఏ మగ డైరెక్టర్ కూడా ఆమెకు సరితూగరు’.. ఆర్జీవీ సంచలన ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 05:23:40  IST  )

వివాదాలకు కేరాఫ్‌గా పేరొందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటారు.

‘ఏ మగ డైరెక్టర్ కూడా ఆమెకు సరితూగరు’.. ఆర్జీవీ సంచలన ట్వీట్
X

దిశ, సినిమా: వివాదాలకు కేరాఫ్‌గా పేరొందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, మళ్లీ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ వెరైటీ కథలతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై, కొత్తగా వచ్చిన సినిమాలపై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ చర్చకు తెరలేపుతున్నారు.తాజాగా ఆర్జీవీ మరోసారి సంచలన పోస్ట్‌తో వార్తల్లోకి వచ్చారు. ‘టాక్సిక్’ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాలెంట్‌ను మెచ్చుకుంటూ, ఆమె ఆలోచనా విధానం కొత్త తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ మేరకు.. ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘‘యష్ (yash)‘టాక్సిక్’(Toxic)టీజర్ చూసిన తర్వాత నాకు ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించింది అంటే ఆశ్చర్యం వేసింది. ఆమె మహిళలకు ఒక అల్టిమేట్ రోల్ మోడల్‌గా నేను భావిస్తున్నాను. ఏ మగ డైరెక్టర్ కూడా ఆమెకు సరితూగరు. ఈ టీజర్‌లో వచ్చే ఒక షాట్‌ని నిజంగా ఆమె తెరకెక్కించింది అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను’’ అనే క్యాప్షన్ జత చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ఆర్జీవీ లాంటి వాడినే షాక్‌కు గురి చేసిందంటూ.. గీతూ మోహన్ దాస్ మాములు అమ్మాయి కాదు.. ‘టాక్సిక్’ టీజర్ ఈ రేంజ్‌లో ఉంటే.. ఇంకా మూవీ ఎలా ఉంటుందో? అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్ భాగం అవడం విశేషం. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఉగాది కానుకగా.. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్ పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈక్రమంలోనే.. యష్ రాయగా.. నటిస్తున్నట్లు తెలుపుతూ.. టీజర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

link

Read More..

బర్త్‌డే స్పెషల్‌గా టాక్సిక్ నుంచి రాయ వీడియో రిలీజ్.. మోస్ట్ డేంజరస్ లుక్‌లో హైప్ పెంచేసిన రాకింగ్ స్టార్

Next Story