బర్త్‌డే స్పెషల్‌గా టాక్సిక్ నుంచి రాయ వీడియో రిలీజ్.. మోస్ట్ డేంజరస్ లుక్‌లో హైప్ పెంచేసిన రాకింగ్ స్టార్

by I. Sairam |   (  Updated:2026-01-08 06:00:05  IST  )

రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.

బర్త్‌డే స్పెషల్‌గా టాక్సిక్ నుంచి రాయ వీడియో రిలీజ్.. మోస్ట్ డేంజరస్ లుక్‌లో హైప్ పెంచేసిన రాకింగ్ స్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి మెల్లిసా పాత్రలో రుక్మిణి వసంత్, నదియా పాత్రలో కియారా, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార నటించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రాకింగ్ స్టార్ యష్ బర్త్‌డే స్పెషల్‌గా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ.. ‘మీ ప్రమాదాన్ని బాగా పరిశీలించుకోండి - RAYA ని పరిచయం చేస్తున్నాము.. టాక్సిక్: ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో పెద్దల కోసం ఒక అద్భుత కథ 19-03-2026న రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక వీడియోలో.. స్మశానంలో గ్యాంగ్ స్టర్స్ అందరూ కారులో వచ్చి ఒకరిని పూడ్చడానికి చూస్తారు.

అప్పుడు చాలా స్పీడుగా ఒక కారు వచ్చి ఆగిపోతుంది. ఆ తర్వాత అందులోంచి ఓ ముసలి వ్యక్తి డ్రింక్ చేస్తూ బయటకు వస్తాడు. అప్పుడు అలర్ట్ అయిన గ్యాంగ్ స్టర్స్ గన్స్‌తో అసలు అక్కడ ఏం జరుగుతుందా అన్నట్లు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు కారులో యష్ ఓ అమ్మాయితో సెక్స్ చేస్తూ ఉంటాడు. ఆ టైమ్‌లో అవతల వాళ్లు అసలు కారులో ఏమీ జరుగుతుందా అని అందరూ ఈగర్‌గా చూస్తున్న టైమ్‌లో కారు పక్కనే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు అందరూ చెల్లా చెదురుగా పడిపోతారు. ఆ టైమ్‌లో యష్ స్టైలీష్‌గా కారు నుంచి సిగరెట్ కాల్చుకుంటూ వచ్చి అందరినీ గన్‌తో పేల్చేస్తాడు. ఇక చివరలో యష్‌కి బర్త్‌డే విషెస్‌తో వీడియో అయిపోతుంది. ప్రస్తుతం యష్‌కు సంబంధించిన డేంజరస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

‘టాక్సిక్’ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ఆయన మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడంటూ మేకర్స్ పోస్ట్


Next Story