కొత్త జర్నీ స్టార్ట్ చేసిన నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం, ఇప్పుడు నిర్మాతగా కూడా అదే బాధ్యతను కొనసాగిస్తాను.

కొత్త జర్నీ స్టార్ట్ చేసిన నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నిత్యామీనన్(Nithya Menon), ఇప్పుడు ఒక కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, తన అభిరుచికి తగ్గ కథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ఆమె ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘కీయురి ప్రొడక్షన్స్’ (Kiyuri Productions) లోగో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిత్యా షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. నిర్మాతగా మారడంపై నిత్యా స్పందిస్తూ.. ‘‘నాకు సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదు. ఆ మూవీ చూసేవారిలో, చేసేవారిలో ఒక మార్పును తీసుకురావాలి.

ఇదే నా లక్ష్యం

నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం, ఇప్పుడు నిర్మాతగా కూడా అదే బాధ్యతను కొనసాగిస్తాను’’ అని తెలిపారు. ‘కీయురి’ అనే పేరుకు అర్థం వివరిస్తూ.. ఇది భూమి గుహల నుంచి పుట్టి, కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె పేర్కొన్నారు. విభిన్నమైన ఆలోచనలతో సినిమాలను నిర్మించాలనే ఆమె ఆశయం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాతగా మారిన ఈ శుభ సందర్భంలో, తన తొలి సినిమా ‘అలా మొదలైంది’ విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిత్యా ఎమోషనల్ అయ్యారు.

షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఒక చిన్న సినిమాగా మొదలైన ఆ ప్రయాణం తన జీవితాన్నే మార్చేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నటిగా తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్న నిత్యా, త్వరలోనే తన నిర్మాణ సంస్థలో రాబోయే తొలి సినిమా వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక నిత్యా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story