పెళ్లి కూతురిగా మారిన Nithya Menen.. డెడికేషన్ లెవల్ కు ఫిదా..

by Disha Web Desk 7 |
పెళ్లి కూతురిగా మారిన Nithya Menen.. డెడికేషన్ లెవల్ కు ఫిదా..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ నిత్యా మీనన్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. పెళ్లి కూతురు గెట్ అప్ లో కనిపించడమే ఇందుకు కారణం కాగా నిజంగానే మ్యారేజ్ అయిపోయిందేమోనని భయపడిపోయామని చెప్తున్నారు అభిమానులు. ఇక విషయానికొస్తే.. రవీంద్రనాథ్ ఠాగుర్ కంపోజ్ చేసిన ' చిత్రాంగద ' నాటకాన్ని స్టేజ్ పై ప్రదర్శించినట్లు తెలుపుతూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసింది నిత్య. పాండవ మధ్యముడు అర్జునుడు, మణిపూర్ రాకుమారి చిత్రాంగద ప్రేమకథను మరింత ఫ్రెష్ గా ప్రజెంట్ చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ నాటకాన్ని బెంగాలీ అమ్మాయిలకు అంకితం చేస్తున్నట్లు చెప్పింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఈ ఫొటోల్లో క్రాఫ్ట్ పట్ల మీకున్న డెడికేషన్ కనిపిస్తుందని, స్పెక్టాకులర్ గా ఉన్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి : వారి ఒడిలో పడబోయిన కియార.. భలే హ్యాండిల్ చేసిందిలే..




Next Story

Most Viewed