పెద్ద హీరోలతో సినిమాలు చేయడం దండగ.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ !

by velandi.Saikiran |

సౌత్ ఇండియా హీరోయిన్ నిత్యామీనన్ (Nithya Menen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ

పెద్ద హీరోలతో సినిమాలు చేయడం దండగ.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఇండియా హీరోయిన్ నిత్యామీనన్ (Nithya Menen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిత్యామీనన్... ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1998 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు... ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నిత్యా మీనన్. అయితే.. అలా మొదలైంది సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిత్యమీనన్.

ఈ సినిమా నిత్యామీనన్ తో పాటు నానికి కూడా మంచి ఊపునిచ్చింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ తో పాటు మలయాళం, కన్నడం, తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది నిత్యామీనన్. ఇక తెలుగులో భీమ్లా నాయక్ తర్వాత సినిమా చేయలేదు హీరోయిన్. అయితే అలాంటి హీరోయిన్ నిత్యమీనన్ తాజాగా... హీరోలపై హాట్ కామెంట్స్ చేశారు.

బడా హీరోలను ఉద్దేశించి ఆమె బాంబు పేల్చారు. బడా హీరోల సినిమాలలో నటిస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదని.. ఆమె పేర్కొన్నారు. చిన్న హీరోల సినిమాలలో చేస్తేనే.. మంచి కిక్ ఉంటుందని... అప్పుడే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని ఆమె వెల్లడించారు. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్నట్లు నిత్యామీనన్ పేర్కొన్నారు. తన పాత్రకు వ్యాల్యూ ఉంటేనే సినిమా చేస్తానని ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Next Story