ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్న నితిన్.. ఈ సమయంలో రిస్క్ అవసరమా అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

హీరో నితిన్‌(nithin)కు గత కొద్ది కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే.

ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్న నితిన్.. ఈ సమయంలో రిస్క్ అవసరమా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: హీరో నితిన్‌(nithin)కు గత కొద్ది కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. 2016 నుంచి 2025 వరకు 11 చిత్రాల్లో నటించగా.. కేవలం ‘భీష్క’ మాత్రమే కొంత మెప్పించింది. ఇక ఆ తర్వాత వచ్చివన్నీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. అయినప్పటికీ నితిన్ వరుస సినిమాల్లో నటించారు. ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన ‘తమ్ముడు’ (thammudu)మూవీతో హిట్ అందుకోలేకపోయాడు. దీంతో వేణు డైరెక్షన్‌లో రాబోతున్న ‘ఎల్లమ్మ’ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం నితిన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడు. తాజాగా, ఓ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

డిజాస్టర్ డైరెక్తర్ శ్రీను వైట్ల (Sreenu Vaitla)ఓ కథను నితిన్‌కు చెప్పగా.. ఆయనకు నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను ఆగడు నుంచి అన్ని ఫ్లాపులను చవిచూశారు. ఇక ఇటీవల తెరకెక్కించిన ‘విశ్వం’ పర్లేదు అనిపించినప్పటికీ విజయం సాధించలేకపోయింది. అలాంటి శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్నట్లు వార్తలు రావడంతో అంతా ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లు వస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

link

Next Story