ఎల్ల‌మ్మ నుంచి ఔట్‌..నితిన్ కు రెండు బంప‌ర్ ఆఫ‌ర్లు..ఈ సారి హిట్ ప‌క్కా?

by velandi.Saikiran |

లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ ఒకరైతే, అనిల్ రావిపూడి మరొకరిని తెలుస్తోంది. నితిన్ తో సినిమా

ఎల్ల‌మ్మ నుంచి ఔట్‌..నితిన్ కు రెండు బంప‌ర్ ఆఫ‌ర్లు..ఈ సారి హిట్ ప‌క్కా?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగిన హీరో నితిన్. అయితే అలాంటి హీరో నితిన్ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 నుంచి 8 సినిమాలు తీశాడు నితిన్. ఇందులో భీష్మ, రంగ్ దే పర్వాలేదనిపించినా, మిగిలిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఓటీటీలో కూడా చూడని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో వేణుతో ఎల్లమ్మ సినిమా ఫైనల్ అవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా నుంచి నితిన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి నితిన్ కోసం ఇప్పుడు ఇద్దరు దర్శకులు రెడీగా ఉన్నారట. అందులో లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ ఒకరైతే, అనిల్ రావిపూడి మరొకరిని తెలుస్తోంది. నితిన్ తో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నారట. చిరంజీవితో సినిమా పూర్తయిన తర్వాత నితిన్ కోసం కథ రాయబోతున్నారట. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది.

Next Story