డ్యూయల్ రోల్ లో నితిన్‌..అదిరిపోయే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ !

by velandi.Saikiran |

హీరో నితిన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నారు. దర్శకుడు విఐ ఆనంద్

డ్యూయల్ రోల్ లో నితిన్‌..అదిరిపోయే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సీనియర్ హీరో నితిన్ ఈ మధ్యకాలంలో హిట్ లేక సతమతమవుతున్నాడు. దాదాపు అరడజన్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఇలాంటి నేపథ్యంలో హీరో నితిన్ ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నారు. దర్శకుడు విఐ ఆనంద్ ( VIAnand ) దర్శకత్వంలో నితిన్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతున్న సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అంతేకాదు హీరో నితిన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో మొత్తం ఇద్దరు హీరోయిన్లను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట. ఇది ఇలా ఉండగా భీష్మ తర్వాత పెద్ద హిట్ అందుకోలేదు. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇలాంటి నేపథ్యంలో అల్లరి బుల్లోడు లాంటి డ్యూయెల్ రోల్ తో వ‌స్తున్నాడు నితిన్. మ‌రి ఈ సినిమాతో స‌క్సెస్ అందుకుంటాడా? లేదా? చూడాలి.

Next Story