‘నా భర్త’ అంటూ షాకిచ్చిన కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్.. లిప్‌‌లాక్ ఇస్తూ (వీడియో)

by Kodari Anjali |   (  Updated:2024-02-15 13:44:55  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

‘నా భర్త’ అంటూ షాకిచ్చిన కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..  లిప్‌‌లాక్ ఇస్తూ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘ఏమైంది ఈవేళా, సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగులో నటిస్తూనే తమిళం, మలయాళంలోనూ రెండు, మూడు చిత్రాల్లో అలరించింది.

కెరీర్‌లో ఎదిగే క్రమంలోనే వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. సినీ కెరీర్‌కు ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పిన నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. నిషా తాజాగా ఓ బ్రాండ్ ను ప్రచారం చేసేందుకు తన భర్తతో కలిసి ఓ యాడ్ షూట్ చేసింది. ఇందులో నిషా అగర్వాల్ తన హస్బెండ్‌కు లిప్ లాక్ కిస్సులు ఇస్తుంది, హగ్ చేసుకుటుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా మారింది. బ్యూటీ ప్రాడక్ట్‌ను వివరించే క్రమంలో ‘నా భర్త’ అంటూ ముద్దులతో ముంచేత్తుతుంది. లిప్ లాప్, కిస్సులు, హగ్ చేసుకుంటూ ప్రొడక్ట్‌ గురించి వివరిస్తుంది. సినిమాల్లోనే ఎంతో పద్ధతిగా కనిపించిన నిషా జస్ట్ యాడ్ షూట్ కోసం ఇంతలా దిగజారాలా? ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ నెట్టింట నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం నిషా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.

Next Story