'18 పేజెస్' ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ: అల్లు అరవింద్

by Dishanational4 |
18 పేజెస్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ: అల్లు అరవింద్
X

దిశ, సినిమా: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా '18 పేజెస్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి సుకుమార్‌ కథ అందించగా సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించాడు. కాగా డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మూవీ యూనిట్.. ఇప్పటి ట్రెండ్‌కి సరిపోయేటట్లు మోడ్రన్‌గా సినిమాను తెరకెక్కించామని, ఆడియన్స్ కచ్చితంగా మూవీతో ప్రేమలో పడతారని చెప్పారు. ఇక నటీనటులంతా ఎంతో కష్టపడి పనిచేసిన సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ అందరికీ నచ్చుతుందన్న అల్లు అరవింద్.. మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు బన్నీ తప్పకుండా వస్తాడని తెలిపాడు.

ఇవి కూడా చదవండి :


'భారతీయుడు 2' కోసం భోజనం చేయకుండా పని చేస్తున్న కమల్!

Next Story