నిఖిల్‌కు ‘ఐకానిక్ గోల్డ్ అవార్డ్’.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
నిఖిల్‌కు ‘ఐకానిక్ గోల్డ్ అవార్డ్’.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: గతేడాది ‘కార్తికేయ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నిఖిల్. రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.121 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చే ప్రముఖ ‘ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్’ వేడుక ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో భాగంగా 2022గాను ‘కార్తికేయ 2’ సినిమా పాపులర్ చాయిస్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్‌కు ఈ అవార్డు అందించారు. అంతేకాదు బాలీవుడ్‌కు చెందిన ఓ పత్రిక నిఖిల్‌ను ‘నేషనల్ లెవెల్ బిగ్ స్టార్ నిఖిల్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story