- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్వయంభూ’ టీజర్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. షాకింగ్ పోస్ట్ వైరల్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’(Swayambhu) షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’(Swayambhu) షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari)దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ అనౌన్స్‌మెంట్ ఈ వారంలోనే ఉంటుందని నిఖిల్ అధికారికంగా ప్రకటించాడు. అంతేకాకుండా, ఈ పరాక్రమవంతుడైన యోధుడి పాత్ర కోసం తాను గత రెండేళ్లుగా పడుతున్న కష్టాన్ని, శారీరక మార్పుల కోసం చేసిన త్యాగాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశాడు. ఈ చిత్రం కోసం నిఖిల్ ఎంతటి అంకితభావంతో పనిచేస్తున్నారంటే.. కఠినమైన డైట్ ఫాలో అవుతూ గత రెండేళ్లుగా తనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌కు కూడా దూరంగా ఉన్నారట. తాజాగా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లు పూర్తి కావడంతో, చిత్ర యూనిట్ ఆయనకు ఐస్‌క్రీమ్ తినిపించారని కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా.. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, సుబ్బరాజు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 'కార్తికేయ-2'తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన నిఖిల్, ఇప్పుడు 'స్వయంభూ'తో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు హింట్ ఇచ్చాయి. టీజర్ అనౌన్స్‌మెంట్ రాబోతుండటంతో అటు నిఖిల్ అభిమానులు, ఇటు సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.






