సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ రొమాంటిక్ నంబర్.. అదిరింది!!

by Dishanational1 |
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ రొమాంటిక్ నంబర్.. అదిరింది!!
X

దిశ, సినిమా: సందీప్ కిషన్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న చిత్రం నుంచి ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సందీప్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన ఈ బ్రీజీ రొమాంటిక్ నంబర్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. అద్భుతమైన కంపోజిషన్, బ్యూటిఫుల్ సింగింగ్, ఆకట్టుకునే సాహిత్యంతో ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలుస్తుండగా.. సందీప్ కిషన్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌, వర్ష బొల్లమ్మ అందాలు ఆకట్టుకుంటున్నాయి. కావ్య థాపర్ మరో కథానాయిక‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read..

కారులోనే అన్ని పనులు కానిచ్చేస్తున్న సమంత.. వైరల్ పిక్



Next Story

Most Viewed