విడాకుల తర్వాత niharika konidela ఫస్ట్​ పోస్ట్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోందిగా!

by Disha Web Desk 6 |
విడాకుల తర్వాత niharika konidela ఫస్ట్​ పోస్ట్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోందిగా!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారికకు ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పని లేదు. మొదట బల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల నిహారిక కూకట్ పల్లీ కోట్‌లో విడాకులకు అప్లై చేయగా.. జూలై 5న మంజూరయ్యాయి. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా విడాకులు తీసుకుని భర్తతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ‘నేను చైతన్య పరస్పర అంగీకారంతో విడిపోవాలని డిసైడ్ అయ్యాము. ఇలాంటి సమయంలో నాతో ఉండి సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు. ఇక మాకు కొంత ప్రైవసీ కావాలి. నన్ను ఇంకా బాధ పెట్టకండి’’ అంటూ రాసుకొచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో సైలెంట్‌గా ఉంది.

తాజాగా, విడాకులు తీసుకుని కొద్ది రోజులు కూడా గడవక ముందే ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. అందులో నిహారిక తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలో టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక కూడా ఉండటం గమనార్హం. దీంతో అది చూసిన నెటిజన్లు నీ వల్ల మరోసారి మెగా ఫ్యామిలీ పరువు పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: నాగబాబు వల్లే నిహారిక విడాకులు తీసుకుందా.. తెరపైకి కొత్త రహస్యం..



Next Story

Most Viewed