సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ‘ఆ సీన్‌’లో నిహారిక.. ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

by Disha Web Desk 10 |
సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ‘ఆ సీన్‌’లో నిహారిక.. ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్
X

దిశ, సినిమా: టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘పుష్ప2’. మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో.. సెకండ్ పార్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక మొన్నటికి మొన్న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీనికి అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అత్యధిక వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో కీ రోల్ కలిగిన ఓ గిరిజన యువతి పాత్రలో నిహారిక కొణిదెల చేస్తోందని, ఆమె ఇందులో ఊహించని లుక్‌లో కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ ఛాన్స్ నిహారికకు దక్కిందట. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

Also Read..

మరో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి



Next Story

Most Viewed