హీరోను బెదిరించిన మెగా డాటర్.. మరో మాట ఎత్తకూడదంటూ

by Disha Web Desk 7 |
హీరోను బెదిరించిన మెగా డాటర్.. మరో మాట ఎత్తకూడదంటూ
X

దిశ,సినిమా: యంగ్ నటి, మెగా డాటర్ నిహారిక వెబ్‌ సీరిస్‌ల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఆమె నటించిన ఓ సీరిస్ ప్రమోషన్ కోసం యంగ్ హీరో విశ్వక్ సేన్‌ను ఆహ్వనించగా.. ఈ కార్యక్రమంలో విశ్వక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు వారిద్దరూ ఒకే కాలేజీలో చదవుకున్నామని తెలిపిన ఆయన.. మాస్ కమ్మూనికేషన్ జర్నలిజం చదివే రోజుల్లో ఎవరికీ భయపడేవాడిని కాదని చెప్పాడు. కానీ, నిహారికను చూడగానే తనలో ఏదో తెలియని భయం మొదలయ్యేదన్న హీరో 'ఏయ్' అంటూ ఓసారి బెదిరించిన సంగతి గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి 'ఏయ్' ప్రమోషన్‌కు రా అని చెప్పగానే ఇంకో మాట ఎత్తకుండా వచ్చేశానని చెప్పాడు. దీంతో తనను ఏడిపించొద్దంటూ నిహారిక సరదాగా విశ్వక్ సేన్‌తో ఫైట్ చేసింది.

చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యంగ్ డైరెక్టర్‌తో సినిమా షురూ

Next Story

Most Viewed