- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుణ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన నిహారిక.. కీలక ప్రకటన విడుదల
సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే పాత బలాన్ని పుంజుకుని తిరిగి వస్తారని ఆశిస్తున్నాం

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వాలీబాల్ టోర్నమెంట్ల నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ మూవీ సీన్లు సహజంగా రావాలని వరుణ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వాలీబాల్ కోచ్‌ల పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఒక ప్రాక్టీస్ సెషన్‌లో డైవ్ చేస్తున్న సమయంలో ఆయన మోకాలిపై తీవ్రమైన ఒత్తిడి పడి ఎముక విరిగిందని చిన్న సర్జరీ కూడా చేయించుకుంటున్నారని పలు వార్తలు వచ్చాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతూ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, మెగా డాటర్, వరుణ్ చెల్లెల్లు నిహారిక సోషల్ మీడియా ద్వారా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. "మా అన్నయ్య వరుణ్ తేజ్‌కు ‘బరి’ సినిమా ప్రాక్టీస్ సమయంలో మోకాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సర్జరీ అవసరమని సూచించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే పాత బలాన్ని పుంజుకుని తిరిగి వస్తారని ఆశిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. వైద్యుల సమాచారం ప్రకారం, వరుణ్ తేజ్‌కు కనీసం రెండు వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమట. మోకాలి సర్జరీ కాబట్టి ఆయన కదలికలపై చాలా పరిమితులు ఉన్నాయి. ఫిజియోథెరపీ, విశ్రాంతి తర్వాతే ఆయన మళ్ళీ నడవగలుగుతారని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. దీనివల్ల ‘బరి’ చిత్ర షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడినట్లు టాక్. షూటింగ్ మళ్ళీ ప్రారంభం కావడానికి కనీసం నెలకు పైగా సమయం పట్టవచ్చని సమాచారం. వరుణ్ తేజ్ ఎప్పుడూ తన బాడీని రిస్క్‌లో పెట్టి పాత్రలకు న్యాయం చేస్తుంటారు. ఇలా దెబ్బలు తగిలించుకోవడం మొదటిసారి ఏం కాదు.. గతంలో కూడా ‘గని’ కోసం బాక్సర్‌గా మారి రక్తం చిందించారు. ఇప్పుడు వాలీబాల్ క్రీడాకారుడిగా పక్కాగా కనిపించాలని ప్రయత్నిస్తూ ఇలా గాయపడటం మెగా అభిమానులను బాధించినప్పటికీ, ఆయన డెడికేషన్‌కు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.






