ఇష్టమైన వ్యక్తికి బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
ఇష్టమైన వ్యక్తికి బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక విడాకుల అనంతరం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. తన డ్రెస్సింగ్ స్టైల్‌తో, బోల్ట్ లుక్‌తో సందడి చేస్తుంది. అయితే.. ఈ మధ్యకాలంలో నిహారిక ఏ చిన్న పోస్ట్ పెట్టిన అది వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలో మెగా డాటర్ మరోసారి వార్తల్లో నిలిచింది.

నిఖిల్ విజయేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్‌లను, ఫెమస్ వ్యక్తులను ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబర్‌గా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే.. నిన్న నిఖిల్ బర్త్‌డే కావడంతో నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి విషెస్ తెలిపింది. ఈ మేరకు ‘‘హోస్ట్ నుంచి కో యాక్టర్‌గా.. అక్కడి నుంచి ప్రొడ్యూసర్.. అటు నుంచి నా తమ్ముడిగా మారావ్. మనం ఎంతో ప్రయాణించాల్సి ఉంది. మంచి మనసు ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నువ్వు ఒకడివి.. లవ్ యూ నిక్కి.. నీకు అంతా మంచి జరగాలి.. హ్యాపీ బర్త్ డే నానా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More News : నిహారికకు రెండో పెళ్లి చేయడానికి సిద్ధమైన నాగబాబు.. వరుడు ఎవరో తెలుసా?
Next Story

Most Viewed