సిసింద్రీ సినిమాలో నా ప్లేస్‌లో అఖిల్ నటించాడు: నిహారిక కొణిదెల

by Disha Web Desk 9 |
సిసింద్రీ సినిమాలో నా ప్లేస్‌లో అఖిల్ నటించాడు: నిహారిక కొణిదెల
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి సుపరిచితమే. నాగబాబు ఈమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. పలు కారణాల వల్ల నిహారిక- చైతన్య డివోర్స్ తీసుకున్నారు. అనంతరం ఈ అమ్మడు రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన మెగా డాటర్ నెట్టింట వస్తున్న వార్తలన్నీ పుకార్లనీ కొట్టిపారేసింది. ఇక నాగశౌర్య సరసన ఒక మనసు సినిమాలో.. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేకపోయాయి. గత ఏడాది డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ మంచి విజయం సాధించింది.

అయితే తాజాగా మెగా డాటర్ ఓ ఇంటర్వ్యూలో హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. సిసింద్రీ సినిమాలో నాగార్జున తనయుడు అఖిల్ నటించిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ స్థానంలో ముందుగా నిహారికను ఎంచుకున్నారట. కానీ నిహారికకు అప్పటికే 8 నెలలు నిండడంతో గోడ పట్టుకుని నడిచేదట. దీంతో కేవలం నేలపై పాకేవారు మాత్రమే కావాలని అఖిల్‌ను తీసుకున్నారట. నిహారిక ఈ విషయం బయటపెట్టాక.. ‘‘నిహారిక కనుక సిసింద్రీ సినిమాలో నటించి ఉంటే.. ఇప్పటికి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోవ్. మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది, పాపం మెగా డాటర్ టైం అస్సలు బాలేదు’ అంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More..

డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సమంత బాటలో ప్రభాస్

Next Story