- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిహారిక అదిరిపోయే స్కెచ్... ఆ దర్శకుడితో మరో చిత్రం !
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కుటుంబం నుంచి వచ్చి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక

దిశ, వెబ్ డెస్క్ : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కుటుంబం నుంచి వచ్చి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు నిహారిక. హీరోయిన్ గా ఒకప్పుడు రాణించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత జడ్జిగా, ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు నిహారిక కొణిదెల. ఈ సినిమాకు యదు వంశీ ( Yadu Vamsi ) దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిశారు.
కోనసీమలోని ఓ గ్రామంలో యువకుల చుట్టూ తిరిగే కథాంశాన్ని చాలా గ్రాండ్ గా వంశీ తెరకెక్కించారు. 2024 ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దాదాపు 9 కోట్లతో ఈ సినిమా తీస్తే, 25 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. అయితే యదు వంశీ, నిహారిక కొణిదెల కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు కథ కూడా నిహారికకు చెప్పారట. 2026 సమయానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందట. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు బయటకు రానున్నాయని సమాచారం.






