రాముని లాంటి మొగుడు కావాలి... ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

by velandi.Saikiran |

నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు రాముడు లాంటి భర్త కావాలంటూ బోల్డ్ కామెంట్స్

రాముని లాంటి మొగుడు కావాలి... ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్ : నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు రాముడు లాంటి భర్త కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది నిధి అగర్వాల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ.. నిధి అగర్వాల్ ప్రస్తుతం బడా హీరోల సరసన నటిస్తున్నారు. 2017 సంవత్సరంలో మున్నా మైకేల్ అనే బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ... ఆ తర్వాత తెలుగులో 2018లో ఎంట్రీ ఇచ్చింది.

సవ్యసాచి అనే సినిమాతో... తెలుగు ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఇక ఇస్మార్ట్ శంకర్ తో.. ఇండస్ట్రీని షేక్ చేసింది నిధి అగర్వాల్. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ కి పెద్దగా సక్సెస్ రాలేదు. ఇలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ ప్రాజెక్టులు ఈమె చేతికి వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజా సాబ్ (Raja saab) సినిమాలో తనది దెయ్యం పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు నిధి అగర్వాల్. తాను ఈ సినిమాలో నన్ అలాగే ఏంజెల్ రోల్ లో కనిపిస్తానని వివరించారు. పౌరాణిక సినిమాలు చేయాలని ఉందని వెల్లడించారు. అలాగే తనకు రాముడు లాంటి మొగుడు కావాలని తన కోరికను బయటపెట్టారు.

Next Story