- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్.. ఉగాది కానుకగా అనిల్ సుంకర కొత్త సినిమా అప్‌డేట్!
దర్శకుడు అనిల్ సుంకర సరికొత్త ఉత్సాహంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ,దర్శకుడు అనిల్ సుంకర, 2024లో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ తర్వాత గతేడాది పెద్దగా హడావిడి చేయని ఆయన, ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. నేడు ఉగాది పండుగ సందర్భంగా.. తన తదుపరి సినిమా అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రానికి ‘ఏయిర్ ఫోర్స్’ (Air Force) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ‘బెజవాడ బ్యాచ్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్ చూస్తుంటే ఇది దేశభక్తి లేదా ఆర్మీ నేపథ్యంలో ఉంటుందనిపిస్తున్నా, ట్యాగ్‌లైన్ మాత్రం లోకల్ మాస్ ఎలిమెంట్స్‌ను సూచిస్తోంది.
అనిల్ సుంకర మార్క్ టేకింగ్‌తో ఈ సినిమా మరో డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఒక కొత్త హీరో పరిచయం కాబోతున్నారు. అనిల్ కావల్య హీరోగా ఈ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ సుంకర తన సొంత బ్యానర్ అయిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిలో ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నామని, ఇండస్ట్రీకి ఒక ‘న్యూ కెప్టెన్’ రాబోతున్నాడని మూవీ మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తానికి, ఉగాది కానుకగా వచ్చిన ఈ ప్రకటనతో అనిల్ సుంకర మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.






