- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: న్యూ ఇయర్ బ్లాస్ట్.. పవర్ స్టార్ అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ (పోస్ట్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాలతో పాటు సినీ రంగంలోనూ ఫుల్ యాక్టివ్‌గా కొనసాగుతున్నారు.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాలతో పాటు సినీ రంగంలోనూ ఫుల్ యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, అభిమానుల్లో జోష్‌ను మరింత పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన ‘ఓజీ’ సినిమాతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన పవన్, తన స్టైల్‌కు తగ్గ యాక్షన్ అవతార్‌తో మరోసారి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ వేగంగా సాగుతున్న ఈ మూవీని మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమానే పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అని, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈనేపథ్యంలో.. తాజాగా వచ్చిన ఓ అప్డేట్ మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌గా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సురేందర్ రెడ్డి (Surender Reddy)దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించడంతో అభిమానుల్లో ఆనందపడుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని జైత్రారామ్ మూవీస్ బ్యానర్‌పై రామ్ తాల్లూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రకటనతో పాటు ఒక ఫొటోను కూడా షేర్ చేయగా, అందులో పవన్ మిలిటరీ ప్యాంట్, బ్లాక్ కలర్ టీషర్ట్‌లో పవర్‌ఫుల్ న్యూ లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కథ, టైటిల్, హీరోయిన్, రిలీజ్ డేట్ వంటి అంశాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. పవన్ నుంచి మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోందన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ అదే ఊపు, అదే ఎనర్జీతో దూసుకెళ్తున్న పవర్ స్టార్.. వరుస సినిమాలతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇస్తూ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో చూపించారు.






