కోవై సరళ 'సెంబి' నుంచి న్యూ అప్‌డేట్!

by Chukka Sudharani |   (  Updated:2023-10-10 14:45:51  IST  )

తెలుగులో లేడీ కమెడియన్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు కోవై సరళ. ఆమె మాట తీరు.. నటన తెలుగు ప్రేక్షకులకు కళ్ల ముందు అలా కనబడుతూనే ఉంటుంది.

కోవై సరళ సెంబి నుంచి న్యూ అప్‌డేట్!
X

దిశ, సినిమా: తెలుగులో లేడీ కమెడియన్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు కోవై సరళ. ఆమె మాట తీరు.. నటన తెలుగు ప్రేక్షకులకు కళ్ల ముందు అలా కనబడుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందంతో కోవై సరళ సృష్టించిన నవ్వుల సునామీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. తమిళనాడులో పుట్టినా తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ 'సెంబి'తో ప్రేక్షకుల ముందుకురానుంది.

ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోవై సరళ వృద్దురాలిగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమానుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ లుక్ చూసిన అభిమానులు ఫొటోలో ఉన్నది కోవై సరళనేనా? కాదా? అని అనుమానపడుతున్నారు. అంత గుర్తుపట్టలేనంతగా ఉంది ఆమె లుక్. ఇక తాజా అప్‌డేట్ ఏమిటంటే.. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం సెకండ్ ట్రైలర్‌ను నటుడు ధనుష్ ఇటీవల విడుదల చేశారు. డిసెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

READ MORE

ఒకే దర్శకుడితో ఒకే రోజు 5 చిత్రాలను ప్రారంభించిన 5 నిర్మాణ సంస్థలు!

Next Story