Latest Updates from Pawan Kalyan's Hari Hara Veera Mallu

by Seetharam |   (  Updated:2022-10-21 07:18:58  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ''హరిహర వీరమల్లు''.

Latest Updates from Pawan Kalyans Hari Hara Veera Mallu
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ''హరిహర వీరమల్లు''. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదీ.. పవర్ స్టార్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, పవన్ రాజకీయాల్లో కొంచెం బిజీబిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదిగా జరుగుతోంది. అందువల్ల ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా షూటింగ్‌కి ఇవ్వాల్సిన ప్రయారిటీ పవర్ స్టార్ ఇస్తున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయల్లో బిజీగా ఉన్నారు కదా.. మరి ఈ సినిమా కంప్లీట్ చేస్తారా? లేదా అనే ఆలోచన చాలామంది మైండ్‌లో ఉండొచ్చు. అయితే అలాంటి వారికోసం తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. షూటింగ్‌ మళ్ళీ రీస్టార్ట్ కావడంలో ఎటువంటి మార్పులు ఉండవని.. పవర్ స్టార్ తన టైం ప్రకారం వీరమల్లు షూటింగ్‌లో పాల్గొని సినిమా కంప్లీట్ చేస్తారని సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి

1.కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత.

Next Story