Shruti Haasan: స్టార్ హీరోయిన్ ట్విట్టర్ అకౌంట్‌లో అలాంటి పోస్టులు కనిపించడంతో నెటిజన్లు షాక్.. ఆమె రియాక్షన్ ఇదే! (పోస్ట్)

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.

Shruti Haasan: స్టార్ హీరోయిన్ ట్విట్టర్ అకౌంట్‌లో అలాంటి పోస్టులు కనిపించడంతో నెటిజన్లు షాక్.. ఆమె రియాక్షన్ ఇదే! (పోస్ట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అంతేకాకుండా సింగర్‌గా కూడా రాణిస్తోంది. కమల్ హాసన్(Kamal Haasan) కూతురుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన శృతి ఇటీవల ‘సలార్’(Salar)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’(coolie) సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. అలాగే ప్రభాస్ సరసన ‘సలార్’ సీక్వెల్‌లోనూ కనిపించనుంది.

ఇటీవల శృతి హాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. పలు పోస్టులు పెట్టడంతో పాటు అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శృతి హాసన్ ట్విట్టర్ ఖాతాలో అన్ని బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు కనిపించారు. ఇక వాటిని చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఇక ఈ విషయం హీరోయిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది.

‘‘హాయ్ లవ్లీస్ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అది నేను పోస్ట్ చేయడం లేదు. కాబట్టి నేను తిరిగి అకౌంట్ రికవర్ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో చాట్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని చేతులెత్తి దండం పెట్టే ఎమోజీతో పాటు హార్ట్ సింబల్ షేర్ చేసింది. అయితే ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. అప్పుడు కూడా ఇలాగే అభిమానులను అలర్స్ చేసింది. అసలు నిత్యం శృతి అకౌంట్‌ను హ్యాక్ చేస్తున్నది ఎవరా అని నెటిజన్లు సైతం ఆలోచనలో పడ్డారు.

Next Story