ఎన్టీఆర్ VS కళ్యాణ్ రామ్.. నకిలీ బ్లడ్ అంటూ ఘాటు విమర్శలు

by Disha Web Desk 7 |
ఎన్టీఆర్ VS కళ్యాణ్ రామ్.. నకిలీ బ్లడ్ అంటూ ఘాటు విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. అయితే పేరు మార్పులో నందమూరి ఫ్యామిలీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించిన తీరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ ముక్కు సూటిగా ఖండించగా.. తారక్ మాత్రం కర్ర విరగొద్దు.. పాము చావొద్దు చందంగా స్పందించారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది.

ఇంతకూ కళ్యాణ్ రామ్ ఏం ట్వీట్ చేశాడంటే.. ''ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు'' అంటూ కుండబద్దలు కొట్టారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ''NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాధారణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు'' అంటూ ట్వీట్ చేశాడు. పేరు తీసేయడం ద్వారా ఎన్టీఆర్ ఖ్యాతి తగ్గదు అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశాడు. కానీ, ఈ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు కానీ, వ్యతిరేకిస్తున్నాను అని చెప్పకపోవడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది.

అయితే ఎన్టీఆర్ ట్వీట్‌పై తెలుగు తమ్ముళ్ల నుంచే విమర్శలు వస్తున్నాయి. ''ఈ విషయంలో ఓ రేంజ్‌లో స్పందించుంటే బాగుండేది. కానీ, ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఈ ట్వీట్ చేయడం దేనికి'' అని నెటిజన్స్ సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తారక్‌ను, కళ్యాణ్‌తో పోల్చుతూ.. నకిలీ, ఒరిజినల్ బ్లడ్ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

Also Read : జగన్ టార్గెట్ నందమూరి ఫ్యామిలీనా?

NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.






Next Story

Most Viewed