NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 19 |
NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించగా.. తాజాగా నటుడు, హిందూపురం ఎమ్మె్ల్యే బాలకృష్ణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని.. ఆయన తెలుగు జాతి వెన్నుముక అని కొనియాడారు.

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారని.. కొడుకు అధికారంలోకి వచ్చి యూనివర్శిటీ పేరు మార్చాడని సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. అన్ని మారుస్తున్న మిమల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. పంచభూతాలు ఉన్నాయని.. తస్మత్ జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ హెచ్చరించారు. అక్కడ ఆ మహానీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారని.. ఇన్ డైరెక్ట్‌గా టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లిన నేతలకు కౌంటర్ ఇచ్చాడు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయంటూ బాలకృష్ణ సీరియస్ అయ్యారు.

Also Read : జగన్ నిర్ణయంతో తెలుగు తల్లి సిగ్గుపడుతోంది: రాఘవేంద్రరావు

ఎన్టీఆర్ VS కళ్యాణ్ రామ్.. నకిలీ బ్లడ్ అంటూ ఘాటు విమర్శలు


Next Story

Most Viewed