తెలంగాణలో రైస్ మిల్లర్లపై విజిలెన్స్ కన్ను.. ఆస్తుల జప్తునకు సర్కార్ సన్నద్ధం!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో రైస్ మిల్లర్ల కోట్ల రూపాయల సీఎంఆర్ (CMR) దందాపై ప్రభుత్వం ఫోకస్ ఫుల్ పెట్టింది.

తెలంగాణలో రైస్ మిల్లర్లపై విజిలెన్స్ కన్ను.. ఆస్తుల జప్తునకు సర్కార్ సన్నద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరి ధాన్యం సీఎంఆర్​కోసం తీసుకుని బియ్యం ఇవ్వకుండా ఎగనామం పెట్టే మిల్లర్లపై పౌరసరపరాల శాఖ కన్నెర్ర చేస్తోంది. గత 10 ఏళ్లుగా రైస్​ఇవ్వకుండా తప్పించుకుంటున్న మిల్లులపై విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంటు దాడులు చేస్తోంది. యాసంగి సీజన్​లో బియ్యం అప్పగించిన మిల్లలపై మెరుపు దాడులు చేస్తుండటంతో మిల్లర్ల యాజమాన్యాలకు వణుకుపుడుతోంది. దాడులు జరగకుండా రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. తాము దోచుకున్న సొమ్ములో కొంత భాగం తమకు ముట్టజెప్పుతామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రముఖ నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద వచ్చి వారితో మంతనాలు జరిపి బియ్యం ఎగనామం పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా భావించిన కొందరు నాయకులు పెద్దమొత్తంలో మిల్లర్ల నుంచి డిమాండ్​చేస్తున్నట్లు తెలుస్తోంది. రబీ సీజన్​లో పౌరసరఫరాల శాఖ 72 లక్షల మెట్రిక్​టన్నులు ధాన్యం సేకరించి వాటిని బియ్యంగా మార్చేందుకు రైస్​మిల్లులకు ఇస్తే వాటిని సీఎంఆర్​చేసి ఎక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.

రంగంలోకి విజిలెన్స్..

ఈ సమాచారంతో వెంటనే విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించింది. గత నాలుగు నెల కితం సీఎంఆర్​కోసం ఇచ్చిన రైస్​లో 40 శాతం కూడా మిల్లర్లు భారత ఆహార సంస్ధకు అప్పగించ లేదు. గత రెండు రోజుల నుంచి మిల్లులపై తనిఖీలు జరుగుతుండటంతో అక్కడ బియ్యం ఎప్పుడో పక్కదారి పట్టాయి. వాటిని జప్తు చేసేందుకు సివిల్​స్లపయి శాఖ తనదైన పద్దతిలో మిల్లర్లపై కొరడా ఝలిపిస్తోంది. ఇటీవల మెదక్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, మహబూబాబాద్​ జిల్లాలో విజిలెన్స్​అండ్ ఎన్​పోర్స్​మెంటు తనిఖీలో రూ. 60 కోట్ల విలువైన సన్న ధాన్యం జాడలేదు. ఇంత ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీ చేసిన మిల్లులు ఆగస్టు 10వ తేదీ లోగా రైస్​అప్పగించాలని నోటీసులు జారీ చేశారు.

చక్రం తిప్పుతున్న నేతలు..

ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వరి ధాన్యం తీసుకుని పెద్ద మొత్తంలో ఎగొట్టిన వారిలో మిల్లర్ల సంఘానికి చెందిన నేతలే ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఏపార్టీ అదికారంలోకి వచ్చిన ఆపార్టీకి చెందిన ప్రముఖ నేతలను మచ్చిక చేసుకుని అక్రమంగా దోచుకున్న సంపాదన కాపాడుకోవడం అలవాటుగా మారింది. మెదక్, నిజామాబాద్​జిల్లాలకు చెందిన ఇద్దరు మిల్లర్ల నాయకులు గత 10 ఏళ్ల నుంచి రైస్​ఇవ్వకుండా ప్రభుత్వానికి రూ.450 కోట్లు సొంత ఖాతాలో వేసుకున్నట్లు మిల్లర్లే చెబుతున్నారు. వారు చేసిన దోపిడీకి చిన్న, మధ్య తరహా మిల్లర్లు ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. పెద్ద మిల్లర్లు ఎంత దోచుకున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు తమ ప్రతాపమంతా చిన్న మిల్లర్లపై చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది మిల్లర్లు రేషన్ బియ్యం దళారులు ద్వారా తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని కొద్దిగా మరాడించి సీఎంఆర్​కింద అప్పగించేందుకు ప్లాన్​చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్,మే. జూన్​నెలలకు సంబంధించిన మూడు నెలల సన్నబియ్యం పౌరసరఫరాల శాఖ ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్​కార్డుల కలిగిన ధనవంతులను నుంచి కొనుగోలు చేశారు. ఇటీవల కేంద్రం వచ్చే మూడు నెలల బియ్యం కూడా ఒకేసారి లబ్దిదారులకు ఇవ్వాలని ఆదేశాలివ్వడంతో మిల్లర్లుకు, దళారులకు అందివచ్చిన వరంలా మారింది.

రేషన్​ పంపిణీ కష్టమే..

గత రబీ కాలం వరి ధాన్యానికి సంబంధించిన బియ్యం మిల్లర్లు అప్పగించకుంటే రేషన్​దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం కొరత ఏర్పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. వానాకాలంలో వచ్చిన సన్న ధాన్యం వచ్చే మూడు నెలలకు సరిపోతుందని, తరువాత కష్టం అవుతుంది. తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం పేదలకు బియ్యం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలు రాకుండా సివిల్​సప్లయి శాఖ సీఎంఆర్​కు అప్పగించిన బియ్యం వీలైనంత త్వరగా మిల్లల నుంచి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు వేగం చేసింది. గడువులోగా ఇవ్వకుంటే మిల్లుకు చెందిన ఇతర ఆస్తులు కూడా జప్తు చేసేందుకు సిద్దమైంది.

Next Story