- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాస్ జాతర’ పాటపై నెటిజన్ల ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రవితేజ!
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)నటిస్తున్న మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘మాస్ జాతర’ (mass jathara) .

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)నటిస్తున్న మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘మాస్ జాతర’ (mass jathara) . ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈక్రమంలోనే.. రవితేజ ‘మాస్ జాతర’ ఫుల్ ఎంటర్‌టైన్ చేసేందుకు అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందం ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, రవితేజ, శ్రీలీల (sreeleela) భాను భోగవరపు సుమతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. గత కొద్ది రోజులుగా ‘మాస్ జాతర’ సాంగ్‌పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లకు రవితేజ కౌంటర్ ఇచ్చాడు. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఓలే ఓలే సాంగ్ బాగానే మార్కులు కొట్టేసి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది. ఇది ఎంతగా పాపులర్ అయ్యిందో.. అంతే స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. ఇందులో ‘‘నీ అమ్మ, నీ అయ్యా, నీ అక్క, నీ చెల్లి గుంట నీ ఒళ్లో కొచ్చి పంట, సిగ్గు లేదు, షేరము లేదు, లాగు లేదు’’ అనే పదాలు వివాదాస్పదమయ్యాయి. చాలామంది అసభ్యంగా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
జానపద స్టైల్ పేరుతో పాటలను పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘పాటలోని కొన్ని లైన్స్ మాత్రమే విని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆ పాట అర్థం తెలియాలంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు.. మొత్తం వినండి. ఈ పాటను కథ డిమాండ్‌ను బట్టి పెట్టారు. కొన్నిటిపై బోల్డ్ మూవీలు అనే ముద్ర వేస్తారు. అలాంటి వాటితో ఎవరికీ ఇబ్బంది రాదు. కానీ వారికి నా సినిమాతో మాత్రమే సమస్య వచ్చింది. మా గ్రామాల్లో స్థానికంగా జరిగే ఉత్సవాల్లో కొంతమంది చిన్న చిన్న కథలు పాటలుగా చెబుతుంటారు. వాళ్లు తిట్టకున్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి వాళ్లు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు.’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ‘మాస్ జాతర’ మూవీ శ్రీలీల, రవితేజ కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.






