- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ జెండాను అవమానించిన మెగాస్టార్.. ఆయనను చూసి గౌరవించడం నేర్చుకో అంటూ నెటిజన్ల ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్ద పేరుకేనా.. గౌరవించడం కూడా తెలియదా అని విమర్శలు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఆగస్టు 15న ఇండిపెండెన్స్‌డే సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఒకేచోట జెండా ఎగరేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నిన్న తన చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లాగ్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్, పలువురు సినీ సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. అయితే ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అల్లు అరవింద్(Allu Aravind) చెప్పులు విప్పి నిల్చిన ఉండగా.. చిరు మాత్రం షూస్ ధరించి కనిపించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అది చూసిన నెటిజన్లు చిరుపై విమర్శలు చేస్తున్నారు. జాతీయ జెండాను గౌరవించడం తెలియదా..? అల్లు అరవింద్‌ను చూసి నేర్చుకో అని అంటున్నారు. అంతేకాకుండా మన జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి. దీని ముందు మెగాస్టార్ అయినా సామాన్య ప్రజలైనా ఒక్కటే అని తెలుసుకో అంత పెద్ద స్టార్ అయిండి జాతీయ జెండాను గౌరవించరా అంటూ తిడుతున్నారు. చెప్పులు విప్పడం తప్పక పాటించాల్సిన నియమం.. దేశ ప్రధాని అయినా అలాగే చేస్తారు. చిరు మాత్రం షూస్ విప్పకుండా జాతీయ జెండాను అవమానించాడని మండిపడుతున్నారు. అలాగే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం చిరు మర్చిపోయి ఉంటాడని అంటున్నారు.






