‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో.. లక్కీ చాన్స్ మిస్ చేసుకున్నాడు అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంటూ.. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతోంది.

‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో.. లక్కీ చాన్స్ మిస్ చేసుకున్నాడు అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంటూ.. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలైతే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ చూసి కన్నీరు పెట్టుకుంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూలే దర్శనమిస్తున్నాయి. అంతా ఈ చిత్రం ఇంపాక్ట్ జనాలపై పడింది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాగా.. పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ ఫుల్‌గా థియేటర్స్‌లో రాణిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి(Dixit Shetty) జంటగా నటించిన ఈ చిత్రం ఆడియన్స్‌ను మంత్ర ముగ్దులను చేస్తోంది. రష్మికతో అతని కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని అతని పాత్రలో చాలా ఎమోషన్స్ దాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.

మొత్తానికి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి పేరు కూడా మార్మోగిపోతోంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి దీక్షిత్ మొదటి చాయిస్ కాదని తెలుస్తోంది. విక్రమ్ పాత్ర కోసం మొదట డైరెక్టర్ రాహుల్ నాగశౌర్యను సంప్రదించాడట. అతనికి కథ కూడా వినిపించగా.. స్టోరీ నచ్చినప్పటికీ ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉండటంతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత దీక్షిత్‌ను సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పి తన నటనతో ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు హిట్ లేని నాగశౌర్య లక్కీ చాన్స్ మిస్ చేసుకున్నాడని అంటున్నాడు.

Next Story