‘‘రష్మిని అన్ని సార్లు పెళ్లి చేసుకుని.. ఇప్పుడిలా షాకిచ్చావ్ ఏంటన్నా’.. సుధీర్‌పై కామెంట్ల వర్షం..!

by Disha Web Desk 9 |
‘‘రష్మిని అన్ని సార్లు పెళ్లి చేసుకుని.. ఇప్పుడిలా షాకిచ్చావ్ ఏంటన్నా’.. సుధీర్‌పై కామెంట్ల వర్షం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జబర్దస్త్’ షోతో బుల్లితెరకు పరిచయమైన సుధీర్ ‘గాలోడు, సాఫ్ట్‌వేర్ సుధీర్’ లాంటి చిత్రాల్లో నటించి హీరో స్థాయికి ఎదిగాడు. అయితే బుల్లితెర స్టేజ్‌పై సుధీర్, రష్మి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే సుధీర్.. రష్మిని చీట్ చేసి, తన సొంత మరదలిని వివాహం చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా తాజాగా మరో రూమర్ వైరల్‌గా మారింది. ఈ హీరో పెళ్లి.. కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారని, అతడి మరదలితో ఆల్‌రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా కంప్లీట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు.. ‘‘రష్మిని ఆన్‌స్క్రీన్‌పై అన్ని సార్లు పెళ్లి చేసుకున్నావు. కానీ నిజ జీవితంలో ఒక్కసారిగా ఇంత పెద్ద షాక్ ఇచ్చావ్ ఏంటి అన్నా?’’ అంటూ పలు రకాల ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed