- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మెగాస్టార్‌కు విలన్‌గా ఆ టాలీవుడ్ యంగ్ హీరో.. ఈ కాంబో అస్సలు ఊహించలేదు బయ్యో అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో 'MEGA 157' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితి రావు హైదరి(Aditi Rao Hydari), పరిణీతి చోప్రా(Paraneethi Chopra) హీరోయిన్లుగా నటించనున్నారని.. వెంకటేష్(Venkatesh) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఉగాది సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమాకి సంబంధించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు విలన్‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, నెగెటివ్ రోల్ చేయడానికి హీరో కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే సీరియస్ రోల్‌లో ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నారు. చిరుతో ఢీ అంటే ఢీ అనేలా ఉంటే బాగుటుందని, అలా కాకుండా కామెడీ విలన్‌గా చూపిస్తే ఫలితం ఉండదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ కాంబో అస్సలు ఊహించలేదు భయ్యో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.