ఫేమ్ వచ్చాక గర్వం తలకెక్కినట్లుంది.. హీరోయిన్ చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా(Nushrat Barucha) టీవీ సీరియల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

ఫేమ్ వచ్చాక గర్వం తలకెక్కినట్లుంది.. హీరోయిన్ చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా(Nushrat Barucha) టీవీ సీరియల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ‘జై సంతోషి మా’(Jai Santoshi Ma) చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన నుష్రత్, తన అందం, నటనతో బాగానే మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఏ సినిమా చేయనప్పటికీ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూ ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది.

తాజాగా, నుష్రత్ చేసిన పనికి జనాలు దారుణంగా తిడుతున్నారు. ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. ఇక ఇందులో తన సొంతంగా షూలు విడిచేందుకు కూడా ఇష్టపడలేదు. అక్కడున్న ఓ మహిళా వాలెంటీర్ చేతిని పట్టుకోగా.. మరో అమ్మాయి షూలు విప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అది చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు పాపులారిటీ వచ్చేసరికి గర్వం తలకెక్కినట్లుంది నీకు’’ అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story