Sai Pallavi : ‘డార్లింగ్.. ఐ షేర్ ఫర్ యు ఎవిరీ థింగ్’.. సాయిపల్లవి చేసిన పనికి ఫిదా అయిపోతున్న నెటిజన్స్..

by Dishafeatures2 |
Sai Pallavi : ‘డార్లింగ్.. ఐ షేర్ ఫర్ యు ఎవిరీ థింగ్’.. సాయిపల్లవి చేసిన పనికి ఫిదా అయిపోతున్న నెటిజన్స్..
X

దిశ, సినిమా : నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా యంగ్ సినీ లవర్స్ అంతా ఆమెను డ్రీమ్ గర్ల్‌గా భావిస్తుంటారు. మొదటి సినిమాతోనే అందరి మనసులు కొల్లగొట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత సెలెక్టివ్ మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది.

చాన్స్ వస్తే చాలు అందాల ఆరబోతతో, బోల్డ్ సీన్స్‌తో నటించి నాలుగు రాళ్లు వెనుకేసుకుందామనునే గ్లామర్ ఫీల్డులో ఉండి కూడా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సినీ వినీలాకాశంలో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతోంది సాయి పల్లవి. ఎటువంటి సినిమా కథ అయినా సరే తనకు నచ్చితేనే ఓకే చెప్పేస్తుందట ఈ అల్లరి పిల్ల. కోట్లల్లో రెమ్యునరేషన్ ఇస్తామన్నా.. తనకు నచ్చకపోతే కాలింగ్ షీట్‌పై అస్సలు సంతకమే పెట్టదట. ఫిదా మొదలుకొని విరాట పర్వం వరకు దమ్మున్న సినిమాల్లో నటించి, తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న సాయి పల్లవి ప్రజెంట్ తండేల్ మూవీలో చేస్తోంది. ‘రామాయణ్’ సినిమాలోనూ సీతగా నటిస్తోందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే సాయి పల్లవి నటనకే కాదు, ఆమె అందానికీ, డ్యాన్స్‌కు కూడా పెద్ద అభిమాన గణమే ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా.. అన్ని భాషల్లోనూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు పెద్ద ఎత్తున క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు. మరికొందరైతే అందుకే సాయిపల్లవి అంటే మాకంత ఇష్టమంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంతకీ వైరల్ అవుతున్న ఫొటోలో ఏముంది? ఆమె ఏం చేసిందనే కదా మీ సందేహం?..

మరేం లేదు. ఎక్కడో తెలియదు కానీ, ఎటువంటి హడావిడి లేకుండా, అత్యంత నిరాడంబరంగా ఒక గ్రౌండ్‌లో కూర్చొని మొక్కను నాటుతోంది సాయి పల్లవి. ప్రజెంట్ ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక నెటిజన్ అయితే ‘DARLING I SHARE EVERYTHING FR U.. IF NEEEDED MY LIFE ALSO’’ అంటూ కామెంట్ చేయగా మరో, నెటిజన్ ‘ఐ లవ్ యూ’ అని, ఇంకొందరు ‘గుడ్ జాబ్, గుడ్ వర్క్’ అని రకరకాలుగా స్పందిస్తూ నేచురల్ బ్యూటీని తెగ మెచ్చుకుంటున్నారు. ఇది చూసిన వారంతా ‘దటీజ్ సాయి పల్లవి’ అంటూ ఫిదా అయిపోతున్నారు.


Next Story

Most Viewed