- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. అమ్మడు గ్రాఫ్ చేంజ్ అయిపోతుందంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది.
ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. నితిన్(Nithin) సరసన ‘రాబిన్ హుడ్’(Robbin Hood), రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ పై చదువులు పూర్తి చేసుకుంటుంది.
అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. కరుణ్ జోహార్ నిర్మాణంలో ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఈ భామ ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. శ్రీ లీల తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aryan) సరసన నటించే బంపరాఫర్ అందుకున్నదట.
రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో అనురాగ్ బసు(Anurag Basu) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శరవేగంగా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.