'అవ‌తార్-2': కామెరూన్ 'నారప్ప' క‌థ‌ను కాపీ కొట్టాడు: నెట్టింట ట్రోలింగ్

by Disha Web Desk 10 |
అవ‌తార్-2: కామెరూన్ నారప్ప క‌థ‌ను కాపీ కొట్టాడు: నెట్టింట ట్రోలింగ్
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న 'అవతార్ 2' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూళ్లుచేస్తుంది. కాక‌పోతే క‌థాక‌థ‌నం, నిడివి విష‌యంలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి. 'అవ‌తార్-2'కు ఓ ఇండియ‌న్ మూవీతో పోలిక‌లు ఉన్నాయంటున్నారు. ధనుష్ నటించిన 'అసుర‌న్' మూవీ తెలుగులో 'నారప్ప'గా వచ్చింది. ఇది త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత దూర‌మైనా వెళ్లే ఒక తండ్రి క‌థ‌. అందులో శ‌త్రువుల దాడిలో ఒక కొడుకును కోల్పోతాడు. మిగ‌తా కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి హీరో శ‌త్రువులతో పోరాడ‌తాడు. 'అవ‌తార్-2' క‌థ కూడా అచ్చం ఇలాగే ఉండ‌డం విశేషం. దీంతో త‌మిళ జ‌నాలు మాత్రం కామెరూన్ 'అసుర‌న్' చిత్రాన్ని కాపీ కొట్టాడంటూ స‌ర‌దాగా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Next Story

Most Viewed