Shah Rukh Khan: ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ బాద్‌షా చేసిన పనికి నెటిజన్లు ఫైర్.. వైరల్ అవుతున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2024-08-15 12:05:20  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అందరికీ సుపరిచితమే. ఆయన ఇటీవల నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే.

Shah Rukh Khan: ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ బాద్‌షా చేసిన పనికి నెటిజన్లు ఫైర్.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అందరికీ సుపరిచితమే. ఆయన ఇటీవల నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఏవో కారణాల వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ప్రజెంట్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ వార్-2. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది కానీ అప్డేట్స్ మాత్రం విడుదల కాలేదు. తాజాగా, షారుఖ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని సందడి చేశాడు.

అంతేకాకుండా ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నట్లు సమాచారం. తొలి భారతీయ నటుడిగా షారుఖ్ నిలిచాడు. అయితే ఈవెంట్‌లో ఆయన పలు కామెంట్స్ చేశారు. కానీ ఫొటోలు దిగుతుండగా.. ఓ పెద్దాయనను తోసేశాడు. ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు షారూఖ్ ఖాన్‌పై విమర్శలు చేస్తున్నారు. పెద్ద స్టార్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయన కావాలని చేయలేదని సరదాగా చేశారని ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Read More..

Shahrukh Khan: 'ముఫాసా: ది లయన్ కింగ్' కోసం రంగంలోకి షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ..

Next Story