- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: సమంత ఏం పాపం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నెటిజెన్స్
హీరోయిన్ సమంత, చైతూ డివోర్స్ పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ సమంత, చైతూ డివోర్స్ పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతోంది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే నేపథ్యంలో సమంత, నాగచైతన్య పేర్లను తెరపైకి తెచ్చి .. కేటీఆర్ వల్లే సమంత విడాకులు తీసుకుందంటూ ఆరోపణలు చేసింది. సినీ ప్రముఖులు సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని ఎవరికి వారు సెపరేట్ అయ్యాక మళ్లీ సామ్ ని ఎందుకు లాగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా సమంత కి సంబంధించిన వార్తలే ఎక్కువ వస్తాయి. ఎక్కడైనా కనిపించినా చాలు ఆమెను ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆమె సినిమాలు చేసుకుంటూ బిజీ గా ఉంది. అసలు సమంత ఏం పాపం చేసిందని రోజుకొకరు ఆమెను మానసికంగా విసిగిస్తున్నారంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






