‘Jailer’ సినిమాలో తెలుగు హీరోలకు అవమానం..! డైరెక్టర్‌పై మండిపడుతున్న Netizens

by Disha Web Desk 7 |
‘Jailer’ సినిమాలో తెలుగు హీరోలకు అవమానం..! డైరెక్టర్‌పై మండిపడుతున్న Netizens
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘జైలర్’. ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ.. 4 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే.. యాక్షన్ సన్నివేశాలతో ఓవైపు దూసుకుపోతున్న ఈ మూవీపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు హీరోలను అవమాన పరిచినట్లు ఉన్నాయని కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విషయమేంటంటే..?

‘జైలర్’ సినిమాలో తెలుగు హాస్య నటుడు, హీరో సునీల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో సునీల్ క్యారెక్టర్‌ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ తెలివి తక్కువ హీరోగా చూపించారట. దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారని తెలుస్తోంది. ఇది ఓవర్సీస్ ప్రింట్‌లలో సబ్ టైలిల్స్ రూపంలో కనిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సునీల్ క్యారెక్టర్‌ను తెలుగు హీరోలను అవమానపరిచేలా చూపించారని డైరెక్టర్‌పై మండిపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో తెలుగు హీరోలను ఈ విధంగా చూపించడం బాలేదు అంటూ విమర్శిస్తున్నారు. కాగా.. ‘జైలర్’ సినిమాలో సునీల్ చేసిన డంబ్ హీరో రోల్ బాగా క్లిక్ అయిందని.. సెకండాఫ్ ఆయన కామెడీ బాగుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : కమల్-రజనీలతో మణిరత్నం మల్టీస్టారర్?

Next Story

Most Viewed