ఈ బడా దర్శకుడి సపోర్ట్ చూసుకుని అవసరానికో మాట మారుస్తున్న రేణు దేశాయ్!

by Disha Web Desk 9 |
ఈ బడా దర్శకుడి సపోర్ట్ చూసుకుని అవసరానికో మాట మారుస్తున్న రేణు దేశాయ్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల పవన్‌కు రాజకీయంగా సపోర్ట్ చేయడంతో పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు అకీరా, ఆద్య తన పిల్లలే అని చెప్పుకొన్న ఈ నటి.. ఇప్పుడు అకీరా పవన్ కుమారుడు అని చెబుతోంది. రేణు దేశాయ్ రెండు విధాలుగా మాట్లాడటానికి గల ముఖ్య కారకుడు టాలీవుడ్‌లో ఓ బడా నిర్మాతనే అని అంటున్నారు. ఎందుకంటే అకీరాను హీరో చేయాలి కాబట్టి.. నీవు పవన్‌కు సపోర్ట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుందని ఒప్పందం కుదుర్చుకున్నారట.

ఈమె కూడా అకీరా కోసం ఒక మెట్టు దిగి, మనసు చంపుకుని పవన్‌ను గెలిపించండి అంటూ జనాలను కోరింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ సీఎం కావాలని ఎప్పుడు కోరుకోలేదని చెప్పుకొచ్చింది. మళ్లీ ఏమైందో తెలియదు పవన్ నా విషయంలో అన్యాయమే చేశాడు కానీ పవన్‌ను రెండు విధాలుగా చూడండి. ఒకటి కుటుంబ పరంగా, రెండు సమాజం పరంగా అని తెలిపింది. ఇలా రేణు దేశాయ్ రోజుకో మాట మార్చడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.


Next Story